01-11-2025 04:39:41 PM
మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటా.... ఈటల రాజేందర్
శామీర్ పేట్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నరు. శామీర్ పేట్ చెరువులో 7 లక్షల చేప పిల్లలు సబ్సిడీ రాగా ఇవాళ దాదాపు 2,50,000ల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. ఈ చెరువులో ఏడు లక్షల చేప పిల్లలు కాదు 50 లక్షల వరకు పెంచవచ్చు అన్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ ఉన్న మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ మొత్తంలో 40 లక్షల మత్స్యకారుల జనాభా కేవలం చేపల పెంపకం మీద ఆధారపడి ఉన్నారన్నారు. వీరంతా గ్రామాల్లో ఉండి చెరువులను నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే స్కీములు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు చూపిస్తే మత్స్యకార సంఘం సొసైటీ భవనం నిర్మించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.