01-11-2025 04:43:54 PM
విద్యావ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి భరోసా
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ (విజయక్రాంతి) విద్యార్థులు సన్మార్గాన్ని ఎంచుకొని, తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జెడ్‌పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్, పీఎం శ్రీ, స్పోర్ట్స్ కిట్టు విద్యార్థులకు అందజేసి, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఇంకా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఖానాపూర్ మండలం మస్కాపూర్ పాఠశాలకు మంచి పేరు ఉందని గత సంవత్సరం నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో పాఠశాల ఉందని ఎమ్మెల్యే అన్నారు.
పాఠశాల నుంచి ఎన్ ఎం ఎం ఎస్, ఐఐటి రంగాలతో పాటు, క్రీడలలో కూడా అనేక పథకాలు సాధించి పాఠశాల మంచి పేరు తెచ్చుకుందని అందుకే ప్రభుత్వం ఈ పాఠశాలకు అన్ని వసతులు కల్పించేందుకు ముందుకు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కాగా పాఠశాలల్లో ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా విద్యార్థులు చదువుల విషయంలో వారి భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులమైన తమకు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాకే భయంగా ఉందని, అందుకే పిల్లలు శ్రద్ధగా చదివి ఉన్నత ఆశయాలు సాధించాలని, రాష్ట్రస్థాయి ఉద్యోగాలే కాదు, జాతీయ స్థాయి ఉద్యోగాల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలోని అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన పాఠశాల మస్కాపూర్ జెడ్పిఎస్ఎస్ అని అయితే పిల్లల తల్లిదండ్రులు కచ్చితంగా ప్రతిరోజు పాఠశాలకు పిల్లలను పంపించాలని ఆమె అభ్యర్థించారు. జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మాట్లాడుతూ పాఠశాల ఉన్నతిని దృష్టిలో ఉంచుకొని గతంలో ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన అనుభవం తనకు ఉందని, మరింత రిజల్ట్స్ తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఎన్నో మౌలిక వసతులు కల్పించేందుకు ఆశతో ఉన్నదని అన్నారు.