calender_icon.png 19 February, 2026 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్రస్థాయిలోకి కమిషనర్లు

19-02-2026 01:29:12 AM

  1. పారిశుద్ధ్యంపై ఉక్కుపాదం
  2. గల్లీ గల్లీలో కమిషనర్ల తనిఖీలు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మున్సిపల్ పరిపాలనలో విప్లవాత్మక మార్పు లు తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలతో హైదరాబాద్ నగరంలోని మూడు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి రంగ ప్రవేశం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల ముగ్గురు కమిషనర్లు బుధవారం ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలాగే రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో పారిశుధ్యం, భద్రతా పరమైన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పాతబస్తీలో పారిశుద్ధ్యం పక్కాగా ఉండాలి: కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, చార్మినార్ జోన్ పరిధిలో పారిశుధ్య కార్యక్ర మాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం ఆయన అదనపు కమిషనర్ రవి కిరణ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మక్కా మసీదు, మదీనా, చార్మినార్ ప్రాం తాల్లో పాదయాత్ర చేశారు.

రంజాన్ వేళ భక్తుల రద్దీ పెరుగుతున్నందున ప్రార్థనా స్థలాలు, వాణిజ్య సముదాయాల వద్ద ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు. రహదారులు, ప్రధాన కూడళ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.