కామన్వెల్త్ భారత్‌లోనే
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): భారతదేశం(India) 2030 కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Game)కు ఆతిథ్యం ఇవ్వబోతోందని, 2036 ఒలింపిక్స్ కూడా మన దేశంలో జరిగేలా విదేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. భారత్ ప్రపంచ స్థాయి క్రీడా శక్తిగా ఎదగాలన్నదే లక్ష్యమని, ఆ దిశగా కేం ద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సం దర్భంగా దేశ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్స హించే కార్యక్రమాలను కేంద్రం నపిర్వ హించింది.
ఇందులో భాగంగా ప్రధాని నరేం ద్రమోదీ దేశ వ్యాప్తంగా 1,500 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్‌లైన్ ద్వారా ముచ్చ టిం చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. హైద రాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని మీ డియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలను ప్రో త్సహించడం ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ఉందన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మన దేశం ఎక్కువ పతకాలు సాధిస్తుందన్నారు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లే ప్రతీ క్రీడాకారుడిని ప్రధాని మోదీ స్వయంగా కలుస్తున్నారన్నారు.






