జాతి జనగణనపై నూతన ప్రశ్నావళి
- రూపొందించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
- సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో 29 రాష్ట్రాల ప్రతినిధుల భేటీ
- బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): రెండోసారి దేశవ్యాప్తంగా జాతి జనగణన(Census) ఆగస్టు 17 నుంచి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్‌లో ప్రారంభమైందని, తక్షణమే ప్రక్రియ ను నిలిపివేసి అఖిలపక్ష పార్టీలతో(All-party parties) కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి నూతన ప్రశ్నావళిని రూపొందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేర కు జాజుల గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
40 ప్రశ్నావళి విధానాన్ని బీసీ సమా జం వ్యతిరేకిస్తుందని, ఖర్గే, రాహుల్‌గాంధీలు కూడా ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రా శారని దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. దురుద్దేశ్యంతోనే కేంద్రం సమగ్ర కులగణన చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ రాసిన లేఖలో ఓపెన్ ఫార్మే ట్ రద్దు, డ్రాప్ డౌన్ పద్ధతుల అమలు, తె లంగాణ, బిహార్‌లను మోడల్‌గా తీసుకోవాలనడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ బీసీ కులగణపై చర్చించేందుకు సెప్టెంబర్ 20న హైదరాబాద్ హోట ల్ టూరిజం ప్లాజాలో జాతీయ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులు చర్చిస్తారని, బీసీ కులగణనపై హైదరాబాద్ కేంద్రంగా జరిగే జాతీయ సదస్సు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.






