బార్‌లో తల్వార్‌తో హల్‌చల్..
సిబ్బందిపై దాడికి యత్నం ముగ్గురి పై కేసు నమోదు..
రాజేంద్రనగర్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): బార్లో మద్యం సేవించేందుకు అనుమతించకపోవడంతో సిబ్బందిపై కత్తితో దాడికి యత్నించిన ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీ సుల వివరాల ప్రకారం.. మంగళవారం రా త్రి 11.45 గంటల సమయంలో లలమ్మ గార్డెన్, పైప్లైన్ రోడ్డులోని టేజెస్పో బార్కు ముగ్గురు వ్యక్తులు వచ్చి బీర్ ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అప్పటికే మద్యం సర్వ్ చేసే అనుమతించిన సమయం ముగిసింద ని, పార్సిల్ మాత్రమే ఇవ్వగలమని సిబ్బంది తెలిపారు.
అయితే బార్లోనే మద్యం సేవిస్తామని పట్టుబట్టిన వారు సిబ్బందితో వా గ్వాదానికి దిగారు. అనంతరం బయటకు వె ళ్లి మరో వ్యక్తికి ఫోన్ చేసి అక్కడికి రావాలని కోరారు. సుమారు పది నిమిషాల తర్వాత వచ్చిన వ్యక్తి కత్తి (తల్వార్)తో బార్లోకి వచ్చి సిబ్బందిపై దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా కత్తి వంగిపోయింది.
ఈ ఘటనలో బార్ సిబ్బంది శ్రవణ్కు గాయాలు కాగా, మహేశ్ అరచేతికి స్వల్ప రక్తస్రావ గాయమైంది. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించారు. అనంతరం నిందితులు స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుల గుర్తింపు, అరెస్టు కోసం చర్యలు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.






