బీఆర్‌ఎస్‌తోనే భవిష్యత్
మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి
బాలానగర్ ఆగష్టు 26: ప్రజలకు మంచి జరగాలంటే టిఆర్‌ఎస్ పార్టీలోనే ఉండాలని మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు పూజారి నరసింహులు, రాపల్లె యాదయ్య, పూజారి జగన్, లింగంతో పాటు 30 మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డా. సి. లక్ష్మారెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరగా.. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి, కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని కోరారు.






