calender_icon.png 27 November, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకరాకు రూ.5 వేల నష్టపరిహారం అందజేత

27-11-2025 12:38:00 AM

  1. రైతులకు వెన్నంటి నిలిచిన విజయక్రాంతి 

నంగునూరు మండలంలో 38 ఎకరాల నష్టానికి పరిహారం 

నంగునూరు, నవంబర్ 26: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలు మొలకెత్తకపోవడం వల్ల నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పరిహారం అంద జేశారు. మొలకెత్తని విత్తనాలపై ’విజయక్రాంతి’ కథనాలు ప్రచురించింది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. మండలంలో మొత్తం 27 మంది రైతులు, 38 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేశా రు.

అత్యధికంగా గట్లమల్యాల, ఖాతా, కొండంరాజపల్లి, ఘనాపూర్, పాలమాకుల, అక్కినపల్లి, తిమ్మాయిపల్లి, వెంకటాపూర్ గ్రామాలలో అధికారు లు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పరిశోధన నిమిత్తం పంపిన విత్తనాలు మొలకెత్తలేదని నిర్ధారణ కావడంతో, సంబంధిత విత్తన కంపెనీతో చర్చించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున పరిహారం అందజేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిణి గీత తెలిపారు.

తమ సమస్యను విజయక్రాంతి ప్రచురించడం వల్లనే అధికారులు స్పందించరాని, అంతకుముందు తాము అధికారుల చుట్టూ తిరిగిన వారు పట్టించు కోలేదని రైతులు తెలిపారు. నష్ట పరిహారం ఇవ్వడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసినందుకు విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.