27-11-2025 12:35:59 AM
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్: 26సిద్దిపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో బుధవారం రా జ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె.హైమావతి హాజరై అధికారులతో కలిసి రా జ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు.ఈస్ట్ ఇండియా కంపె నీ, ఆంగ్లేయుల పాలనలో ప్రజలకు ఇచ్చిన అక్రమ చట్టాల వల్ల స్వేచ్ఛ లేకపోయిందని తెలిపారు.
స్వాతంత్య్ర ఉద్యమ ఫలితంగా 1947 ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్య్రం లభించిందని, అనంతరం రాజ్యాంగం 1949 నవంబరు 26న ఆమోదం పొందిందన్నారు.1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగం దేశాన్ని గణతంత్రంగా తీర్చిదిద్దిందని తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు ఆచరించాలన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.