18-07-2025 01:04:57 AM
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
బెజ్జూర్, 17 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమిని, తలాయి, తిక్కపల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. వ్యవసాయం చేస్తున్న రైతుల పంట పొలాలు,పత్తి పంటలు అన్ని నీట మునగడంతో రైతులు దుఃఖ సాగరంలో మునిగి పోయారు.
ఈ ఏటా పంట చేతికి వస్తుందనే రైతుల ఆశలు అడియాసలు అయ్యాయి. గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పంట పొలాలు అన్ని నీట మునగడంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.