calender_icon.png 18 July, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాధికారమే లక్ష్యంగా ముదిరాజులు పోరాడాలి

18-07-2025 01:05:01 AM

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్

ఎల్లారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి) రాజ్యాధికారంలో వాటాయే లక్ష్యంగా ప్రతి ముదిరాజ్ బిడ్డ పోరాడాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్ పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల ముదిరాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

రాజకీయ పార్టీలకు ముదిరాజులు ఓటు బ్యాంకుగా మారకూడదని, నాయకత్వ లక్షణాలను పెంచుకొని ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండి ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నారు.  అనంతరం జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ నూతన మండల, యువజన కమిటీల కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ముదిరాజ్ సంఘం ఎల్లారెడ్డి మండల గౌరవాధ్యక్షులుగా కుడుముల సత్యనారాయణ, అధ్యక్షులుగా ప్యాలాల రాములు, కార్యనిర్వాహక అధ్యక్షులు దుద్దుల సాయిరాం, ఉపాధ్యక్షులు నీల సిద్ధిరాములు, జక్కుల అశోక్, బాలయ్య, ఒట్లం భాస్కర్, బోనగిరి ఎల్లయ్యలు, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్, కార్యదర్శలుగా కాశీరామ్, లక్ష్మయ్య, చంద్రబాబు, దత్తు, రవీందర్, కాశిరాం, కోశాధికారి మరి సూర్య ప్రకాష్, కార్యవర్గ సభ్యులుగా కేబీ రాజు, పాండు, గంగాధర్, సాయిబాబా, వెంగల్ రాములు లను ఎన్నుకున్నారు.

యువజన కమిటీ అధ్యక్షులుగా కిరణ్ తేజ, ఉపాధ్యక్షులు జనముల పోచయ్య, బద్ధుల రాములు, నీల రవి, క్యాస రమేష్, ప్రధాన కార్యదర్శి కంచుమల్లె మహేందర్, ఉప కార్యదర్శిలు చింతల రమేష్, పెద్ద బోయిన విటల్, అంజయ్య, తలారి సాయిలు, నాగరాజు, లచ్చయ్య ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ సొసైటీ చైర్మన్లు ఏగుల నర్సింలు, బోన్ల సాయిలు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి బాలకిషన్, స్థానిక సొసైటీ సీఈఓ విశ్వనాథం, డైరెక్టర్ మర్రి సూర్యప్రకాష్, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు సాయిరాం, బాలయ్య, ఎల్లయ్య, రవీందర్, లక్ష్మయ్య, కాశీరాం, సంగమేశ్వర్, మాజీ ఎంపీటీసీ సంతోష్ కుమార్, మాజీ ఉప సర్పంచ్లు శ్రీకాంత్, యాదయ్య, గంగాధర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెలుట్ల సంతోష్ కుమార్, నీల రవి, ఒట్లం భాస్కర్, ఆయా గ్రామాల ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.