24 May, 2026 | 8:14 AM

కేటీఆర్‌పై సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు

21-08-2024 02:50 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మందరపు అనిల్‌కుమార్ యాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మంగళవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డిని ‘చీప్ మినిస్టర్’ అని సంబోధించారని,  సీఎం పరువు, ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్స్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.