ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలు
- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు
- హెచ్‌ఎండీఏ జాయింట్ కలెక్టర్‌గా శ్రీవత్సకోట
- ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఆమ్రపాలికి ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు ఆమె అదనపు బాధ్యతలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ఆమ్రపాలిని తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమ్రపాలితో పాటు మరో ఐదుగురు ఐఏఎస్‌లను కూడా బదిలీ చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌కు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న శ్రీవత్సకోటను హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. నారాయణ్‌పేట్ అడిషనల్ కమిషర్‌గా ఉన్న మయాంక్ మిత్తల్‌ను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లు, సీవరేజ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న చహత్ బాజ్ పాల్‌ను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు.






