16 April, 2026 | 2:18 AM

ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

16-04-2026 12:41 AM

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 15 : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన బీఆర్‌ఎస్ నాయకులు కొందరు సోషల్ మీడియా, ప్రచార సాధనాలలో  అసత్యపు ప్రచారాలను చేస్తున్నారని వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడుకు  కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ ఫిర్యాదు చేశారు.

బుధవారం యాదగిరిగుట్టలో డిఎస్పి కి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ  బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలతో కూడిన పోస్టులు చేస్తూ ప్రజలకు తప్పుడు సందేశాలు ఇస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.   

మేరకు యాదగిరిగుట్ట డిఎస్పీ, ఆలేరు ఎస్హెచ్‌ఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బిఆర్‌ఎస్ కెసిఆర్ కల్ట్ 2.0 పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అయన  తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో బైరాన్ నగర్ సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వరరాజు, మండల నాయకులు కంతి నాగరాజు, వీరభద్రం రాజు తదితరులు పాల్గొన్నారు.