ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఏఈఓ జానయ్య
నూతనకల్లు, ఏప్రిల్ 15:ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మండల విస్తరణ అధికారి బాసిగంపల జానయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని దొడ్డురకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ధాన్యం నాణ్యతను మరియు తేమ శాతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..
రైతులు నాణ్యమైన, తూర్పార ప ట్టిన, తాలు మరియు మట్టి పెళ్లలు లేని ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూ చించారు. ముఖ్యంగా ధాన్యంలో తేమ శాతం 17% ఉండేలా చూసుకోవాలని స్ప ష్టం చేశారు. ప్రభుత్వం క్వింటాల్కు రూ. 2,389 మద్దతు ధర చెల్లిస్తోందని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకో వాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో వీఓ శ్రీలత, కేంద్రం నిర్వాహకులు ఉమ, శైలజ, రజిత, సంపత్ రెడ్డి మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.






