అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ
22-04-2026 04:26 PM
సోనాల మండల కేంద్రంలో మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్న సర్పంచ్ కార్యదర్శి
బోథ్,(విజయక్రాంతి): సనాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాల అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేసిన మొబైల్ ఫోన్లను గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మౌనిక మాట్లాడుతూ... అంగన్వాడి టీచర్లు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ పరంగా సరఫరా అవుతున్న వివిధ రకాల సామాగ్రిని తీసుకునే అవకాశం ఉందన్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సెల్ఫోన్ల పాత్ర ఎంతగానో ఉందన్నారు, కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటరమణ పలువురు అధికారులు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.






