calender_icon.png 2 February, 2026 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా సురేఖపై ఠాణాలో ఫిర్యాదు

04-10-2024 01:40:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రముఖ సినీ నటులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మహిళా నేతలు మండిపడ్డారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిప డ్డారు. ఆమె చేసి నిరాధార ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.