29-07-2025 12:32:14 AM
ఘట్ కేసర్, జూలై 28 : అనురాగ్ యూనివర్శిటీలో హైదరాబాద్కు చెందిన ఐఈఈఈ ఎస్‌ఎస్‌ఐటి (సొసైటీ ఆన్ సోషల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ టెక్నాలజీ) ఛాప్టర్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3 ఆధ్వర్యంలో ఘట్కేసర్ పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థుల కోసం ‘విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం‘ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈకార్యక్రమంలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల సరైన అవగాహన కల్పి స్తూ, నోట్స్ తయారీ, డౌట్స్ క్లారిఫికేషన్, టైమ్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించబడింది. ఈకార్యక్ర మంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఐఈఈఈ ఎస్‌ఎస్‌ఐటి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.క్లబ్ సభ్యు లు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఓసాధనంగా ఎలా వినియోగించాలో తెలియజేసారు.
విద్యార్థులు టెక్నాలజీ పట్ల ఆసక్తిని కనబరిచారు.ఈసందర్శనను హెడ్‌ఐటీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ నితీషాశర్మ, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వై. వి. రెడ్డి, ప్రో గ్రామ్ కోఆర్డినేటర్ ఎంసిఎ శేఖర్ రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ జి.ఎల్. ఆనంద్ బాబు, జి. సాయి కృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3 ప్రోగ్రామ్ ఆఫీసర్ పురుషోత్తం, ఈ కార్యక్రమానికి నేతృ త్వం వహించారు. విద్యార్థుల్లో టెక్నాలజీ పట్ల అవగాహనను పెంపొందించడంలో ఈ కార్యక్ర మం కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.