5 June, 2026 | 2:53 AM

పంట అవశేషాల కాల్చివేతపై సంపూర్ణ నిషేధం

05-06-2026 01:47 AM

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్*

హనుమకొండ, జూన్ 4 (విజయ క్రాం తి): పంట అవశేషాలను కాల్చడం వల్ల వా యు కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, నేల సారవంతత తగ్గిపోవడం, ప్రజారోగ్యం ప్రమాదంలో పడటం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను తగుల బెట్టడం వల్ల హానికర వాయువులు వెలువడి వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, ప్రజల ఆరోగ్యం, మానవ జీవనం, రహదారి భద్రత, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

అంతేకాకుండా భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని తెలిపారు. ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా శాంతిభద్రతల దృష్ట్యా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత -2023 సెక్షన్ 163 కింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాలు, వ్యవసాయ భూములు, పొలాల్లో పంట అవశేషాల కాల్చివేతను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత -2023 సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. .

మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా  ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదేళ్లలోని మహి ళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సెంట ర్ ద్వారా నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమా లు, శిక్షణకు సంబంధించిన మెటీరియల్, సెంటర్ లోని వివిధ శిక్షణ విభాగాలను పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించి కేంద్రం గురించిన వివరాలను డిఆర్డిఓ  మేన శ్రీను, అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే విధంగా వారం రోజుల్లో శిక్షణ కా ర్యక్రమాలను ప్రారంభించాలని అధికారుల ను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను మహిళలు స ద్వినియోగం చేసుకొని లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంత రం మండల సమైక్య కార్యాలయం కోసం శంకుస్థాపన చేసిన భూమి వివరాలను తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి యాదవ్, అడిషనల్ డిఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఎంపీడీవో కల్పన, డీపీఎం రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.