పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలి
మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు
రామాయంపేట, జూన్ 4: రామాయంపేట పట్టణ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని, పట్టణ ప్రజలు కూడా అందుకు సహకరించాలని రామయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అన్నారు. గురువారం ప్రజా పాలన-ప్రగతి ప్రాణాళికలో భాగంగా రామా యంపేట మున్సిపాలిటీ 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులలో మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్స న్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు, బ్లాక్ కాం గ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకు లు, పట్టణ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ యూత్ నాయ కులు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది. పట్టణ అభివృద్ధి కా ర్యక్రమాలను మరియు రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన చర్యల గురించి మరియు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని భవిష్యత్తు తరాలకు ప్ర జలందరూ మార్గదర్శకంగా బాధ్యతగా ఉం డాలని మున్సిపల్ చైర్ పర్సన్ చెప్పడం జరిగింది. పట్టణ అభివృద్ధి జరగాలంటే ప్రజలు కూడా తమకు సహకరిస్తేనే సాధ్యమవుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డుల్లో సమస్యలు ఏవి రాకుండా చూస్తామన్నారు.






