14 July, 2026 | 3:36 AM

నులిపురుగుల నిర్మూలనతోనే చిన్నారుల్లో సంపూర్ణ ఆరోగ్యం..

14-07-2026 12:08 AM
  1. ఎమ్మెల్యే ముఠా గోపాల్..
  2. జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాత్రల పంపిణీ..

ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి):  నులిపురుగలు నిర్మూలణతోనే పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు నులిపురుగలు నిర్మూలణ (ఆల్బెండజోల్) మాత్రలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ  విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలని సూచించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదవగలరని పేర్కొన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, త్వరగా అలసిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణ్యాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.

ముషీరాబాద్ విద్యామండలి పరిధిలో 55,571మంది ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బేం డజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి రోజు మాత్రలు వేసుకోని వారు 20వ తేదీన మరోసారి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, బీఆర్‌ఎస్ నాయకులు రహీం, ముచ్చకుర్తి ప్రభాకర్, అంబర్ పేట క్లస్టర్ డాక్టర్ శ్రీకళ, డాక్టర్ లారా మీణన్, ఏఎన్‌ఎం విజయకుమారి, ఆశావర్కర్లు పాల్గొన్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి ఆసుపత్రికి వచ్చిన చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలు వేశారు.