calender_icon.png 9 July, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరకట్ట నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయండి

09-07-2025 12:55:24 AM

ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు 

భద్రాచలం, జులై 8 (విజయ క్రాంతి); గోదావరి వరదల నుండి భద్రాచలం పట్టణంలోని ప్రజలు మరియు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను, రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట పనులు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణం పనులు వేగవంతం చేసి మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఇరిగేషన్ ఎస్సీ నీ ఆదేశించారు.

మంగళవారం  సుభాష్ నగర్ కూనవరం రోడ్డులోని కొత్తగా నిర్మాణం చేపడుతున్న కరకట్ట స్లూయిస్ పనులను, విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్న స్లూయిస్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ భద్రాచలం  గోదావరి వరదలు క్రమేపి హెచ్చుతగ్గులతో ప్రవహిస్తున్నందున ముందుగానే ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొవాలని, అధిక వర్షాల వలన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసరాలు, అన్నదాన సత్రం పరిసరాలు, పట్టణంలోని డ్రైనేజీలలో అధిక వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీల నిండిపోయి వరద నీరు రోడ్డుపైకి రాకుండా  ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని, విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్న స్లూయిస్ పాయింట్ దగ్గర ఏర్పాటుచేసిన 50 హెచ్ పి మోటర్లు 5, 250 హెచ్ పి మోటార్లు నాలుగు సక్రమంగా పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అన్నారు.

గోదావరి వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలు కానీ, భద్రాచలం పట్టణం ప్రజలు కానీ ఎవరు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు వహించాలని,  ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే నాణ్యత పాటించి జాప్యం చేయకుండా  సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కోరారు. 

అనంతరం భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ క్లబ్బులో రూ 5 లక్షల తో నిర్మాణం చేపట్టి పూర్తిచేసిన టాయిలెట్ రూములను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ రావు, ఇరిగేషన్ ఈ ఈఈ జానీ, డిఇ మధుకర్, ఏ ఈ వెంకటేశ్వర్, జిపిఈఓ శ్రీనివాస్ మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.