09-07-2025 12:53:42 AM
ముగ్గురు మంత్రులను ఆహ్వానించనున్న అధికారులు
11 ప్రభుత్వ శాఖల ద్వారా 35. 32 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
ఖమ్మం, జులై 8 (విజయ క్రాంతి): పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు... ప్రతి ఏడాది ప్రభుత్వం నిర్వహించే వనమోహత్సవంలో భాగంగా, ఈ ఏడాది జిల్లా లో అటవీ శాఖ ఆధ్వర్యంలో 11 ప్రభుత్వ శాఖల ద్వారా 35.32 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు చే శారు.
డి ఆర్ డి ఓ ద్వారా 11.55 లక్షలు, మునిసిపల్ శాఖ ద్వారా 8.42 లక్షలు, అటవీ శాఖ ద్వారా 5.47 లక్షలు, వ్యవసాయ శాఖ ద్వారా 3.45 లక్షలు, సెరికల్చర్ ద్వారా 2.30 లక్షలు, సిం గరేణి కాలరీస్ ద్వారా 1.32 లక్షలు, ఇరిగేషన్ ద్వారా1.14 లక్షలు, ఎక్సైజ్ శాఖ ద్వారా 0.81 లక్ష లు, మైనింగ్ శేఖర్ ద్వారా 0.46 లక్షలు, ఇండస్ట్రీస్ శాఖ ద్వారా 0.30 లక్షలు, విద్యా శాఖ ద్వారా 0.10 లక్షలు మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 4.,15 లక్షల మొక్కలు నాటారు.
జిల్లాలోని ముగ్గురు మంత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని పులి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.4 వ స్థానంలో ఖమ్మం: సోమవారం నాటికీ రాష్ట్రం మొత్తం 45.34 లక్షల మొక్కలు నాటగా, ఒక్క ఖమ్మం జిల్లాలోనే సోమవారం నాటికి 4.15 లక్షల మొక్కలు నాటారు. ఇప్పటికే జిల్లాలో 11.77 శాతం మొక్కలు నాటడం పూర్తి చేశారు. 3 విఐపి బ్లాకు లు: జిల్లాలోని మూడు ప్రదేశాలను అధికారులు వి.ఐ.పి బ్లాకులుగా గుర్తించారు. ఇక్కడ ఒక్కో ప్రదేశంలో వేలాది మొక్కలను నాటే ఏర్పాటు చేస్తున్నారు.
పులి గుండాల, రఘునాథపాలెం, సత్తుపల్లి ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని గుర్తించారు. అక్కడ ఒక్కో ప్రదేశంలో 15 వేల నుంచి 20 వేల మొక్కలు నాటించనున్నారు. ఈ విధంగా వేలాది మొక్కలు నాటి ఆ ప్రదేశాన్ని చిన్న అడివిలా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. ముగ్గురు మంత్రులకు ఆహ్వానం: జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముగ్గురు మంత్రులను ఆహ్వానించి లాంఛనంగా పులిగుండాలలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
* 35.32 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాటు,జిల్లాలో 35.32 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశాము. నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అటవీశాఖ తో కలిపి 11 ప్రభుత్వ శాఖలతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. జిల్లాలోని ముగ్గురు మంత్రులను ఆహ్వానించి పులిగుండాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
సిద్ధార్థ విక్రం జిల్లా అటవీ శాఖ అధికారి