2 April, 2026 | 4:13 AM

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

07-12-2024 05:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంగార్డుల దినోత్సవంలో హోంగార్డులకు వరాలు ప్రకటించడంపై శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో హోంగార్డులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హోంగార్డులకు వేతనాలు పెంపు వీక్లీ అలవెన్స్ పెంపు ఐదు లక్షల బీమా బండి సదుపాయాలను కల్పించిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రమేష్, అయ్యో సురేష్ తదితరులు పాల్గొన్నారు.