9 August, 2026 | 3:33 AM

క్లిష్టమైన కిడ్నీ శస్త్రచికిత్స విజయవంతం

09-08-2026 12:46 AM

శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ ఘనత

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ ప్రముఖ యూరాలజిస్ట్ డా. ఎ. రాంప్రసాద్ రెడ్డి, ఎంఎస్, ఎంసీఎహ్‌చ్ పర్యవేక్షణలో క్రాస్డ్ ఫ్యూజ్డ్ ఎక్టోపిక్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. ఈ రోగికి పుట్టుకతోనే ఎడమ కిడ్నీ కుడివైపుకు క్రాస్ అయి, రెండు కిడ్నీలు కలిసిపోయిన క్రాస్డ్ ఫ్యూజ్డ్ ఎక్టోపిక్ కిడ్నీ అనే అరుదైన సమస్య ఉంది. అటువంటి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

రోగికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో పాటు తీవ్రమైన నొప్పి, జ్వరం లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు అయినా సమస్య పరిష్కారం కాకపోవడం తో డా.రాంప్రసాద్ రెడ్డి యూరాలజీస్ట్‌ని సంప్రదించిన రోగికి ఈ నెల 3న చికిత్స విజయవంతం జరిగింది. రోగికి 72 గంటల పాటు ఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి, తగిన యాంటీబయాటిక్స్, అవసరమైన చికిత్స అందించడం జరిగింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉంది మరియు డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సలో డా.రిజ్వాన్, డ్రా.సామ్రాట్, ఇతర ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.