11 August, 2026 | 1:50 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

సమగ్రాభివృద్ధి తుమ్మల లక్ష్యం: మేయర్ నీరజ

20-06-2025 10:37 PM

ఖమ్మం (విజయక్రాంతి): సమగ్ర అభివృద్ధి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) లక్ష్యమని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ(Mayor Punukollu Neeraja) అన్నారు. తుమ్మల చొరవతో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు ఖమ్మం నగరంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి శుక్రవారం 29, 30, 33, 34, 35, 36, 47 డివిజన్లో జరిగింది. కార్యక్రమంల్లో ఆమె మాట్లాడుతూ... పనుల ఒత్తిడి కారణంగా రాష్ట్ర మంత్రి తుమ్మల కార్యక్రమాలకు రావడం కుదరక తమను కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాల్సిందిగా సూచించారని ఆమె తెలిపారు. 

ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు త్రీ టౌన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు రుడావత్ శంకర్ నాయక్, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ నాయకులు కన్నం ప్రసన్న, నాళం సతీష్, సాదే శంకర్, బొమ్మ ఉదయ్, లక్కీ ఉపేందర్, అర్వపల్లి శివ, నల్లపు శ్రీనివాస్, బాలిని శ్రీను, వెన్న పండు, వెంకన్న, ఎస్కే జానీ, ఎస్కే జాకీర్, మరాఠీ రమేష్, బొమ్మగాని సైదులు, ముద్దు కృష్ణ, తోట రంగారావు, తుపాకుల మధు, సాయి, సాదె  భవాని, అర్వపల్లి స్వాతి, స్థానిక ప్రముఖులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.