20-06-2025 10:33:26 PM
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామం మల్కాపూర్ కాంగ్రెస్ యువజన నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆంజనేయులు గౌడ్ ను హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మండలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని వారితో వివరించారు. ఇందులో గ్రామ కమిటీ అధ్యక్షుడు చిన్నకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె తిరుపతి ముదిరాజ్, తిరుపతి రెడ్డి, మహేష్, మన్నె భాస్కర్, పల్లెపాటి చింటు, కొంతం రాజులు ఉన్నారు.