17-01-2026 06:38:55 PM
ర్యాంపులలో అక్రమాలను అరికట్టాలి
అక్రమ రహదారులు, అర్ధరాత్రి లోడింగ్‌పై చర్యలు తీసుకోవాలి
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
రేణుక అక్షరమండలి డిమాండ్
మణుగూరు,(విజయక్రాంతి): తిర్లాపురం పంచాయతీ పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో శనివారం తెల్లవారుజామున మిషన్ డ్రైవర్ మృతిఫై సమగ్ర విచారణ జరిపించాలని, రేణుక అక్షరమండలి అధ్యక్షురాలు పూనెం సరోజ డిమాండ్ చేశారు. సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ర్యాంప్ లో మిషన్ డ్రైవర్ మృతి పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అతను స్నానానికి వెళ్లి ప్రమా దవశాత్తు నదిలో పడి చనిపోయాడా, లేక ఎవరైనా చంపారా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలతో వ్యక్త మవుతున్నాయని, ఇసుక ర్యాంపు ల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారాలే ఈ మరణానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని, మండల ప్రజలకు వివరించాలన్నారు. రాంపుల పేరుతో అక్రమ రహదారులు నిర్మించి, గోదావరి నదిని, వాగులను ఇష్టారాజ్యం గా ధ్వంసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. వే బిల్లులు లేకుండా హైదరాబాద్ తదితర పట్టణాలకు అక్రమంగా ఇసుక తరలింప యథేచ్ఛగా సాగుతోందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి కాంట్రాక్టర్లు కోట్ల రూపా యలు దోచుకుంటున్నారని విమర్శించారు. అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా లోడింగ్ పనులు చేయిస్తున్నారని, నిద్రాహారాలు లేకుండా పని చేయించడం వల్లే ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనుల సహజ సంపదైన ఇసుకను బయటి కొందరు అక్రమార్కలు సొసైటీ పేరుతో కొల్లగొడుతున్నా రని ద్వజమెత్తారు. ర్యాంపులు శ్రమ దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చి మృతి చెందిన బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటే పారదర్శక విచారణ జరగాలని, అనుమా నాస్పద మృతిగా కాకుండా అన్ని కోణా ల్లో పరిశీలించి కేసు నమోదు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ర్యాంపు అనుమతులు రద్దు చేయా లన్నారు. లేదంటే ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.