17-01-2026 06:41:21 PM
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల స్థాయిలో సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్–జాకస్–మండె డాగ్యురె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మం–మణుగూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు టాస్ వేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. టోర్నమెంట్‌కు హాజరైన ఎమ్మెల్యేను ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, సింగరేణి జీఎం వీసం కృష్ణయ్య, ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్, మాజీ వైస్ ఎంపీపీ మండల రామ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్లు దమ్మాలపాటి వెంకటేశ్వరావు, యదలపల్లి అనసూయ, సర్పంచులు బానోత్ శారద, అరెం ప్రియాంక, నాయకులు కాకటి భార్గవ్, ఈసం లక్ష్మణ్, దండుగుల శివ, టౌన్ మహిళా అధ్యక్షురాలు గాలపల్లి స్వరూప, ఫోటోగ్రాఫర్స్ టౌన్ ప్రెసిడెంట్ మారుతి ప్రకాష్, ఆర్గనైజర్స్ సుమిత్ర, బియన్ని సుదర్శన్, పప్పు, జగదీష్, సెక్రటరీ ఆకుల రమణ, యునస్, మదన్, నవిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.