21-02-2026 02:23:41 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): జిల్లాలో విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, క్రీడా కార్యకలాపాలు, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. తిర్యాణి మండలం చింతపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీరు, పారిశుధ్యం, డార్మెటరీ మౌలిక సదుపాయాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చింతపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల క్రీడా ప్రతిభను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించిన సింగరేణి సంస్థ సేవలు అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.