21-02-2026 02:22:34 AM
మూడుసార్లు టెండర్లు నిర్వహించి, శంకుస్థాపనతో సరి
నిధులు మంజూరైనా.. పనులు చేపట్టేందుకు ముందుకురాని గుత్తేదారులు
ఉట్నూర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం కృషి చేస్తు రహదారుల నిర్మాణం చేపడుతోంది. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని గ్రామాల పరిస్థితి వేరేగా ఉంది. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన, పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. కొన్ని గ్రామాలకు మంజూరైన నిధులతో మంత్రితో పాటు ఎమ్మెల్యే సైతం శంకుస్థాపనలు చేసిన నేటికీ పనులు ప్రారంభం కాలే దు.
ఉట్నూర్ ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన, గుత్తేదారులు పనులు చేపట్టకపోవడంతో రహదా రులు పూర్తిగా గుంతలమయం అయ్యాయి. ఈ రహదారులపై కాలినడక సైతం కష్టంగా మారింది. ఆటోలు ఇతర వాహనాలు ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు జంకుతున్నారు.
ఇంద్రవెల్లి మండలంలోని వాడ్‌గావ్, ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి ఆదిలాబా ద్ గ్రామీణ మండలంలోని చిదరి ఖానాపూర్, తదితర గ్రామాల్లో రహదారి మరమ్మత్తులతో పాటు ఉట్నూర్ మండలం నర్సాపూర్ (బీ), తదితరుల గ్రామాల రహదారులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు మంత్రి సీతక్క ద్వారా ఆరు రహదారులకు రూ.36.89 కోట్లు మంజూరు చేయించారు.
మంజూరైన నిధులకు రాష్ట్ర పంచాయతీ రా జ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచిన గుత్తేదారులు ముందు కు రాలేదు. దీంతో నిధులు మంజూరైన రెండేళ్లుగా పనులు ప్రారంభం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తగిన చర్యలు తీసుకొని, మంజూరైన నిధులకు వెం టనే పనులు ప్రారంభించి వర్షాకాలం ప్రారంభంలోగా తార రోడ్ల పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
మంత్రి సీతక్క శంకుస్థాపన చేసినా..
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీత క్క జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న సమయంలో శంకర్‌గూడ నుంచి దుబగూడ వరకు రోడ్డు నిర్మాణానికి మంజూరైన రూ. 1.5 కోట్లు తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఏడాది పూర్త యిన నేటికీ పనులు ప్రారంభం కాలేదు. దుబ్బగూడ రోడ్డుతో పాటు ఉట్నూర్ ఏజెన్సీలోని పలు గ్రామాల రోడ్లకు శంకుస్థాపన చేసి న నేటికీ రహదారుల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. స్వయంగా మంత్రి సీతక్క శంకుస్థాపన చేసిన రోడ్డుల పనులను ముందుకు తీసుకు వెళ్లాలని ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గిరిజనుల ఆరోపిస్తున్నారు.
మరోసారి టెండర్లు పిలుస్తాం..
ఉట్నూర్ పంచాయతీ రాజ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు రోడ్డు నిర్మా ణం కోసం ప్రభుత్వం నిధులు మంజూ రు చేసింది. మంజూరైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు వేసిన పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. మరోసారి టెండర్లు పిలిచి త్వరలో పనులు మొద లుపెడతాం.
రమేష్ పవార్, డిప్యూటీ ఈఈ, పంచాయతీ రాజ్ శాఖ ఉట్నూర్