20-01-2026 01:26:55 AM
అర్జున్‌దాస్, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’. పవర్ హౌస్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంతో హరీశ్ దురైరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యోగిబాబు, వడివుక రసి, చైల్డ్ ఆర్టిస్ట్ అకిలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు లోకేశ్ కనగ రాజ్ సోమవారం లాంచ్ చే శారు. ఓ మధ్యతరగతి కుటుం బం కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే 80% షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సీన్ రోల్డాన్; సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్; ఎడిటింగ్: అరుల్ మోసెస్ ఎ; ప్రొడక్షన్ డిజైన్: రాజ్ కమల్; రచన, దర్శకత్వం: హరీశ్ దురైరాజ్.