18 March, 2026 | 2:20 AM

కుక్కల ఘటనపై సర్పంచుల్లో ఆందోళన

14-01-2026 07:06 PM

బయటకు ఎలా వచ్చిందని ఆరా..!

కామారెడ్డి,(విజయక్రాంతి): విష ప్రయోగంతో 600 కుక్కలను హతమార్చిన ఘటనలో మాచారెడ్డి మండలంలోని ఐదుగురు సర్పంచులపై  కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు కుక్కలపై విషప్రయోగం జరిగిన విషయాన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్​గా మారింది.

అయితే గ్రామాల్లో అంతర్గతంగా బయటకు పొక్కకుండా జరిగిన ఈ ఘటన ఫౌండేషన్ ప్రతినిధులకు ఎలా తెలిసిందన్న ప్రశ్నలు సర్పంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలను కుక్కల బెడద నుంచి కాపాడేందుకు చేసిన ఘటన ఒక్కసారిగా తమ మెడకు చుట్టుకోవడంతో ఆ సర్పంచులు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.