14-01-2026 07:03:48 PM
ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హెచ్.ఎన్.ఎస్ బ్రదర్స్
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ క్రాంతి రిపోర్టర్ కొండ సైదులు గౌడ్,కార్యదర్శి ఎల్లావుల వెంకటేష్ లను బుధవారం హెచ్.ఎన్.ఎస్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎన్ఎస్ బ్రదర్స్ ఫౌండేషన్ సభ్యులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నీలా హేమ్ల నాయక్ మాట్లాడుతూ... మండలంలో ఉన్న ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి, సభ్యులకు ఆయన భోగి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని అనేక గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఎంతోకాలంగా పేరుకుపోయి ఉన్నాయని వాటిని పత్రిక మిత్రులు గుర్తించి పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. జర్నలిజం విలువలను పాటిస్తూ పత్రిక మిత్రులందరూ రాజకీయాలకతీతంగా అధికార వర్గాలతో, రాజకీయ పార్టీ ప్రతినిధులతో, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గుగులోతు సందీప్ నాయక్, నరేందర్ నాయక్, బచ్చలకూరి కోటయ్య, కేతావత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.