24 August, 2026 | 11:33 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

అమెరికా యుద్ధోన్మాదం ఖండించండి

24-06-2025 08:21 AM
  1. సామ్రాజ్యవాద అధిపత్యం కోసమే అమెరికా దాడులు.
  2. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచానికి, భారతదేశానికి నష్టం
  3. యుద్ధంపై బిజెపి ప్రభుత్వం, మోడీ తన వైఖరిని ప్రకటించాలి.
  4. సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం.

వైరా,(విజయక్రాంతి): సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్ పై దాడులకు పాల్పడుతుందని, అమెరికా దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచి పెంచుతాయని పచ్చిమాసియా దేశాలను అస్థిర పరుస్తాయయని, యుద్ధాలు వలన  ప్రపంచ దేశాలలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని, దీనివలన భారతదేశము కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం వైరా పట్టణంలోని మిట్టపల్లి ఫంక్షన్ హాల్ నందు సిపిఐ(యం) వైరా పట్టణం,  కొణిజర్ల మండలాల పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులను తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. 

ఇరాన్ అను ఆయుధాలను తయారు చేస్తుందన్న ఎలాంటి ఆధారం లేదని అంతర్జాతీయ అను శక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ, అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థలు తెలిపినా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా నిన్నటి వరకు ఒక పధకం ప్రకారం ఇరాన్ పై ఇజ్రాయిల్ తో దాడులు చేయించి, ఇప్పుడు అమెరికా కూడా ఇజ్రాయిల్ తో చేతులు కలిపి దాడులు జరుగుతుందని విమర్శించారు. అమెరికా ఇజ్రాయిల్ దేశాలకు దౌత్య ప్రక్రియపై గౌరవం లేదన్నారు. చూస్తున్నాయన్నారు.

అమెరికాకు దుశ్చర్యను రష్యా చైనా క్యూబా వెనిజులా ఖండించిన భారత ప్రధాని మోడీ స్పందించకపోవడం బిజెపి దొంద నీతికి నిదర్శనం అన్నారు. బిజెపి ప్రభుత్వం, మోడీ ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దాడుల పైన తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్దాలను నివారించి ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఖండించాలని కోరారు.