18 April, 2026 | 8:19 AM

ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించండి

24-06-2025 01:31 AM

తెలంగాణ వామపక్ష పార్టీల పిలుపు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఇరాన్‌పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబుదాడులను ఖండిస్తూ అఖిల భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ వామపక్ష పార్టీలు కోరాయి.ఈ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, ప్రపంచశాంతి కోరేవారు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి.