బొల్లారం గ్రామ పంచాయతీలో మహిళా గ్రామసభ నిర్వహణ
నాగిరెడ్డిపేట,ఆగస్టు 4 (విజయ క్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ అధ్యక్షతన మహిళా గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బద్దిగారి ప్రభుగౌడ్ మాట్లాడుతూ...గ్రామంలోని డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి రుణాలు పొంది చిన్నతరహా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
గ్రామంలోని మహిళా సంఘాల కోసం మహిళా సంఘం భవనం మంజూరైందని,ఆభవన నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.భవనం పూర్తయిన అనంతరం డ్వాక్రా మహిళలు తమ సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అన్నారు.
పంచాయతీ కార్యదర్శి జి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ...మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గ్రామ పరిశుభ్రత, ఆరోగ్యం, పారిశుధ్యం,దోమల నివారణ చర్యల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్, కార్యదర్శి సంతోష్ కుమార్, జీపీఓ లక్ష్మణ్,ఐకేపీ కమ్యూనిటీ అసిస్టెంట్ లు లావణ్య,సాయి, తదితరులు పాల్గొన్నారు.






