calender_icon.png 10 January, 2026 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ జీవితం, సాహిత్యంపై సదస్సు

09-01-2026 12:00:00 AM

హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో రెండురోజుల సదస్సు ప్రారంభం 

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో ‘అందెశ్రీ జీవితం, సాహిత్యం- సంవీక్షణం’ అంశం మీద రెండు రోజుల జాతీ య సదస్సు గురువారం  ప్రారంభమైంది. తెలుగు శాఖాధ్యక్షుడు, సదస్సు సంచాలకుడు ఆచార్య పిల్లలమర్రి రాములు ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించారు. అందెశ్రీ కవి త్వంలో కనిపించే సామాజిక, ఆధ్యాత్మిక, ఆధిపత్య నిరసనలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

‘అందెశ్రీ అభిజాత్యాలను అధిగమించిన మహాకవి’ అని ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు డా. గోరటి వెంకన్న పేర్కొన్నారు. అందెశ్రీ అంతర్ముఖీన కవి అని కొనియాడారు. మానవ జీవన గాథలతో మమేకమైన జీవితం అందెశ్రీది అని అన్నారు.  ‘జీవన తాత్త్విక రుషి పుంగవుడు అందెశ్రీ’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అక్షరం ద్వారా మాత్రమే జ్ఞానం అందుతుందని గాక లోకజ్ఞానం అనేది చాలా ప్రధాన అంశమని, సామాజిక వ్యవస్థ స్వభావాన్ని తెలిసినవా డే జ్ఞానవంతుడని అన్నారు. తొలి రోజుల్లో అందెశ్రీ జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో పాల్గొన్న విషయాన్ని మానవీయశాఖల  పూర్వ డీన్ ఆచార్య కృష్ణ తెలిపారు.

ఆ చార్య అన్సారి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య గోనా నాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య విజయలక్ష్మి, వారిజా రాణి, ఆచార్యత్రివేణి, ఆచార్య తిరుపతి, భుజంగరెడ్డి డా.విజయ్ కుమార్ , డాక్టర్ బాశెట్టిలత, విజయ కుమారి, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొని అందెశ్రీ రచనల్లోని వైవిధ్యమైన అంశాలపై చర్చించారు. అందెశ్రీ తో ఉన్న అనుబంధా న్ని గూర్చి  బాల్య స్నేహితులు నాంపల్లి రాము లు, ప్రపంచ యాత్ర నిర్వహించిన ఎర్ర సత్యనారాయణ, మూడు దశాబ్దాల అనుబంధాన్ని కలి గి ఉన్న బోనాల ప్రకాశ్ విద్యార్థులకు వివరించారు. వాక్కులమ్మ గానసభను దేవతా సుధాకర్ రసవత్తరంగా నిర్వహించారు.