09-01-2026 12:00:00 AM
ఏసీపీ చక్రపాణి
ఉప్పల్ జనవరి 8 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగకు స్వంత ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఉప్పల్ ఏసిపి చక్రపాణి అన్నారు. ఉప్పల్ ఏసీపీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారు తీసుకొస్తా జాగ్రత్తగా గురించి అవగాహన ఆటోను ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ కె.భాస్కర్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వెళ్లేవారు పోలీసులు సమాచార ఇవ్వడం వల్ల దొంగతనంల నివారణకు చెక్ పెట్టొచ్చు అన్నారు. ఎవరైనా అనుమానస్పదంగా ఎవరైనా సంచరిస్తే 100 సమాచార ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిఐ రామలింగారెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.