calender_icon.png 29 July, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి, ఆయిల్‌పామ్‌పై సదస్సు

24-07-2025 12:13:02 AM

జహీరాబాద్, జూలై 23 : ఝరాసంగం మండలం రైతు సదస్సులో మామిడి ఆయిల్ ఫామ్ లపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సదాశివపేట, కోహిర్, ఝరాసంగం ఉద్యానవన శాఖ అధికారి సునీత తెలిపారు. గురువారం నాడు ఝరాసంగం రైతు వేదికలో మామిడి తోట సాగు సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ఆయిల్ ఫామ్ చెట్లను వేసుకొనే రైతులకు ఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు రైతులందరూ పాల్గొని అధిక దిగుబలు సాధించాలని ఆమె తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు రైతులు సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తిచేశారు.