24-07-2025 12:13:58 AM
డిచ్‌పల్లి, జూలై 23 (విజయ క్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పీజీ సెమిస్టర్ పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ మాట్లాడుతూ సిపిజిఈటి పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే తేదీలలోనే ఆగష్టు 4 నుండి 11 వరకు ఉండడం చేత పీజీ ఎంట్రెన్స్ రాసే విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నాయి.
కారణంతోటి పోస్ట్ చేయాలని పెద్ద ఎత్తున విద్యార్థులతో కంట్రోలర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది దాదాపు మూడు గంటల వరకు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే బ్యాక్లాగ్ పరీక్షలు రెగ్యులర్ పరీక్షలతో పెట్టడం వల్ల రెండు రాసే విద్యార్థులకు ఒకేరోజు రెండు పరీక్షలు ఉండడం వల్ల చదవడం మరియు రాయడం ఇబ్బంది అవుతుందని బ్యాక్ లాక్ ఎగ్జామ్ లు రెగ్యులర్ ఎగ్జామ్స్ కంటే ముందే పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు యూనివర్సిటీ యూనివర్సిటీ అధికారులు తలొగ్గి పీజీ 2,4 రెగ్యులర్ పరీక్షలను సిపిజిఈటి పరీక్షల తర్వాత నిర్వహిస్తామని మరియు బ్యాక్లాగ్ పరీక్షాలని రెగ్యులర్ పరీక్షల కంటే ముందే నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి,యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్,యూనివర్సిటీ నాయకులు సమీర్ అజయ్ అక్షయ్ రాకేష్ అశోక్ నవీన్ పృద్వి లెనిన్ రోహన్ శివ మరి విద్యార్థులు పాల్గొన్నారు.