భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
13-06-2025 12:40 AM
రాజాపూర్ జూన్ 12: రైతుల సమస్యలు పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందని తాసిల్దార్ రాధాకృష్ణ అన్నారు. గురు వారం మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే గతంలో పరిష్కారం కానీ భూ సమస్యలపై రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మంజుల రెవిన్యూ సిబ్బంది రైతులుపాల్గొన్నారు.






