24 August, 2026 | 5:23 AM

కంగ్రాట్స్ రఘు..

13-06-2024 12:33 AM

ఎంపీ రఘునందన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్

ఆసక్తిగా తిలకించిన ఇరుపార్టీల నాయకులు

అమర్‌నాథ్ యాత్రికుల నిత్యావసర సరుకుల వాహనాన్ని ప్రారంభించిన నేతలు

సిద్దిపేట, జూన్ 12 (విజయక్రాంతి): సిద్దిపేట శరబేశ్వర ఆలయంలో బుధవారం శివ పార్వతుల కల్యాణోత్సవం నిర్వహించగా.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు. ఎంపీగా విజయం సాధించిన రఘునందన్ రావుకు హరీశ్ రావు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాట్స్ రఘు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

కార్యక్రమం జరిగినంత సేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకు లు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఇద్దరు కలిసి అమర్‌నాథ్ యాత్రికుల కోసం నిత్యావసర సరుకులు తీసుకెళ్లే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీ శ్ రావు మాట్లాడుతూ.. సామాజిక సేవలో సిద్దిపేట వ్యాపారులు ఎప్పుడూ ముందంజ లో ఉంటారని అన్నారు. 13 ఏళ్లుగా అమర్‌నాథ్ యాత్రికులకు సిద్దిపేట అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు అన్నదా నం చేయడం గొప్ప విషయమని అన్నారు. 

పేదోల్ల కోసమే ప్రభుత్వ దవాఖాన..

సిద్దిపేట అర్బన్, జూన్ 12: సిద్దిపేట ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల, అన్ని హంగులతో దవాఖానను ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు, వైద్యులు, నర్సులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేదల కోసమే ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.