24 August, 2026 | 4:55 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్థానం..

13-06-2024 12:35 AM

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాం తి): పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేచాలు ఒక వర్గం యువత ఉగిపోతుంది. ఆయన సినిమా విడుదల ఉందంటే థియేటర్ల వద్ద పండగే పండగ. సుమారు పదేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగారు. 1996లో సినిమా పరిశ్రమకు పరిచయమైన పవన్ క్రమంగా స్టార్ ఇమే జ్ తెచ్చుకున్నారు. 2008లో సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో వీలైనమైంది. కొన్నాళ్లు పవన్ స్తబ్దుగా ఉన్నారు. కొన్నాళ్లకు కామన్ ప్రొటక్షన్ ఫోర్స్ (సీఎంపీఎఫ్) ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుం డా టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019లో భీమవరం, గాజువాకలో పోటీచేసి ఓడిపోయారు. నాడు జనసేన తరఫున ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా.. వెరవకుండా ఐదేళ్లపాటు పవన్ కాల్యాణ్ ప్రజల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. అనేక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చివరకు ఈ మధ్య నే జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో పీఠాపురం నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. జనసేన నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించుకుని వందశాతం విజయం సాధించారు. కఠోర శ్రమ ఫలించి ఇప్పుడు ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది.