15-10-2025 07:07:49 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలుకు ఈ నెల 18న బీసీ సంఘాల నేతలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ సంఘాల, కుల సంఘాల తోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ సంఘం నేతలు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈనెల 18 తేదీన జరగబోయే బంద్ కు అన్ని పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించాలని అది అమలయ్యేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సంఘం నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎన్నం ప్రకాష్, ఆది మల్లేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు, నాగుల కనకయ్య గౌడ్, రాచమల్ల రాజు, నారోజు రాకేష్ చారి, కోడూరి పరశురామ్ గౌడ్, నర్సింగోజు శ్రీనివాస్, రంగు సంపత్ గౌడ్, మాచర్ల అంజయ్య, గంగిపెల్లి అరుణ, ఎడ్ల సురేందర్, ఆకుల సురేష్, చిగుర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.