అన్వితా రెడ్డికి అభినందనల వెల్లువ
28-06-2024 01:31 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : ప్రముఖ పర్వతారోహకురాలు పడమటి అన్వితను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సుదర్శన్ రెడ్డి గురువారం ఘట్‌కేసర్‌లోని తన కార్యాల యంలో అభినందించారు. అంకుషాపూర్‌కు చెందిన అన్వితా రెడ్డి ఇటీవల నార్త్ అమెరికాలోని ఎత్తునా డెనాలి పర్వతం (20,310 అడుగులు)ను అధిరోహించిన నేపథ్యంలో ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ప్రపంచంలోని మరిన్ని పర్వతాలను అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గీతారెడ్డి, సామాజిక కార్యకర్త చందుపట్ల జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






