18 April, 2026 | 6:33 PM

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

28-06-2024 01:32 AM

రహదారులు జలమయం

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, దుర్గం చెరువు, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, అమీర్‌పేట, మైత్రీవనం, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, కోఠి, రామాంతపూర్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ కారణంగా లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.