18 April, 2026 | 9:45 PM

Breaking News

ముగ్గురు బైక్ దొంగల అరెస్టు

28-06-2024 01:30 AM

మహేశ్వరం, జూన్ 27: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముగ్గురు బైక్ మెకానిక్‌లను మీర్‌పేట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ జయపురి కాలనీకి చెందిన జూలు ప్రవీణ్ (36), బండ్లగూడకు చెందిన డేరంగుల సత్యం (34), మీర్‌పేట్ జనప్రియ మహానగర్‌కు చెందిన నూనె మూతల విజయ్ కృష్ణ(36) అనే ముగ్గురు బైక్ మెకానిక్‌లు. వీరి మధ్య పాత పరిచయం ఉంది. జల్సాలకు అలవాటు పడిన వీరు మీర్‌పేట్ ప్రాంతంలో విద్యాసంస్థలు, వైన్స్ షాపులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు విశ్వసనీయ సమాచారం అంద డంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.