13 May, 2026 | 9:08 PM

Breaking News

కాంగ్రెస్, ఆ పార్టీ న్యాయవాదులకు కంగ్రాట్స్

28-08-2024 03:15 AM
  1. అందుకే కవిత జైలు నుంచి బయటకు.. సింఘ్వి రాజ్యసభకు
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పారు. కవితను బయటికి తీసుకొచ్చేందుకు కృషిచేసిన అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు.

అలాగే కవితకు బెయిల్ రావడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల సమిష్టి విజయం అని.. ఇందులో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని  సంజయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. క్విడ్‌ప్రోకోలో భాగంగానే ఇది జరిగిందని ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నామన్నారు. విలీనం మాట ముచ్చట పూర్తయిందని, ఇక అప్పగింతలే తరువాయి అని ఆయన తన ట్వీట్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ఆరోపణలు చేశారు.