కాంగ్రెస్ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్‌కుమార్ యాదవ్
ముషీరాబాద్, డిసెంబర్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్‌కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజాపాలన కోఆర్డ్డినేటర్ గౌరి సతీష్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 53 వేల ఉద్యోగాలను భర్తీ చేసి యవతలో ఆత్మవిశ్వాసం పెంచిందని అన్నారు. అన్ని హామీలను అమలు చేసేదిశగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన సంబురాలను వాడవాడలా అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈనెల 7వ తేదీన అన్ని డివిజన్లు, నియోజక వర్గాలలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని, 8న మెగా బైక్ ర్యాలీలు చేపట్టాలని సూచించారు.




